ఆర్ఆర్ఆర్ కు మరో షాక్

0
81

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలింది. ఢిల్లీలో కీలకమైన పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్టేషన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామకృష్ణంరాజును తప్పించారు. 
ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

రఘురామకృష్ణంరాజు స్థానంలో ఆ పదవిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి కేటాయించారు. అక్టోబర్ 9 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజు పై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన సంస్థలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన పదవి కూడా తొలగిపోవడంతో వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here