ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్..

0
100

ఐర్లాండ్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ తమ ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల్లో తక్కువ ప్రతిభ కనబరుస్తున్న 5 శాతం(25 వేలకు పైగా) మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్దమైంది. ఇటీవల సీఈఓ జూలీ స్వీట్ ఆధ్వర్యంలో జరిగిన స్టాఫ్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ వెల్లడించింది. యాక్సెంచర్‌కు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో కంపెనీలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్సెంచర్‌ కంపెనీల్లో ఐదు లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఇందులో రెండు లక్షల ఉద్యోగులు కేవలం ఇండియా నుంచే ఉన్నారు. దీంతో తాజా నిర్ణయం భారత్‌లోని ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది.

ప్రతి ఏడాది తాము తక్కువ ప్రతిభ కనబరిచే ఉద్యోగులను గుర్తించి వారి స్థానంలో వేరే వారికి చోటు కల్పిస్తున్నట్టు సీఈఓ జూలీ స్వీట్ స్టాఫ్ మీటింగ్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది తమకు కొత్త వారి అవసరం లేదని చెప్పారు. సబ్ కాంట్రాక్టర్లను తగ్గించి తాజా నియామకాలను నిలిపివేసినప్పటికి.. మరింత మంది ఉద్యోగులను తీసేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ వృద్ధి 1.3 శాతానికి పడిపోయినట్టు జూలీ స్వీట్ తెలిపారు. ఈ ఏడాది తక్కువ ప్రతిభ కలిగిన వారికి ఉద్వాసన పలకడంతో పాటు ఎవరెవరికి మెరుగుదల అవసరమో గుర్తించామన్నారు. కాగా.. భారత్‌లో మాత్రం తాము నియామకాలను చేపడతామని.. ఇటీవలే అనేక మంది ఉద్యోగులకు బోనస్‌లతో పాటు ప్రమోషన్లను కూడా ఇచ్చినట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here