ఐపీఎల్.. రికార్డు వ్యూయర్‌షిప్‌

0
34

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగా ఎదురు చూస్తారో మరోసారి రుజువైంది. స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి లేకపోయినప్పటికీ… ఐపీఎల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఐపీఎల్ 13వ సీజన్‌కు క్రికెట్‌ అభిమానుల నుంచి విశేషాదరణ లభిస్తున్నది. కరోనా కారణంగా లీగ్‌ను యూఏఈలో నిర్వహిస్తుండటంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐపీఎల్‌ అభిమానులు టీవీ, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో లైవ్‌ మ్యాచ్‌లను చూస్తున్నారు. ఐపీఎల్‌ లైవ్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా టీవీ ఛానెళ్లు, మొబైల్‌ యాప్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ల ద్వారా మ్యాచ్ వన్ని లైవ్ టెలికాస్ట్ లో చూడొచ్చు.

ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌ వీక్షకుల పరంగా రికార్డు సృష్టించింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై.. మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్ ను రికార్డు స్థాయిలో ప్రేక్షకులు చూశారు. లీగ్‌ మొదటి మ్యాచ్‌ను  రికార్డు స్థాయిలో ఏకంగా 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. గ్లోబల్‌ వ్యూయర్‌షిప్‌ రికార్డులను సైతం బ్రేక్‌ చేసింది. 

ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పిందని బీసీసీఐ సెక్రటరీ జై షా ఆనందం వ్యక్తం చేశారు. బార్క్‌ నివేదిక ప్రకారం.. ‘అసాధారణ స్థాయిలో 20 కోట్ల మంది ప్రజలు మ్యాచ్‌ను వీక్షించారు. ఏ దేశంలోనైనా, ఏ క్రీడా లీగ్‌ల్లోగానీ ఓపెనింగ్‌ డే రోజు ఇంత భారీ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ నమోదు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏ లీగ్‌ కూడా ఘనమైన ఆరంభాన్ని పొందలేదు.

ఐపీఎల్‌ చరిత్రలోనే టీవీ, డిజిటల్‌ మీడియాలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నామని ఐపీఎల్‌ ట్విట్ చేసింది. ‘థాంక్యూ ఇండియా, వరల్డ్‌ అంటూ ట్వీట్‌ చేసింది. ముంబై, చెన్నై మ్యాచ్‌ను 200 మిలియన్‌ వ్యూయర్‌షిప్ వచ్చినట్లు వెల్లడించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here