ఒకరోజు కలెక్టర్ గా బాలిక.. ఎందుకలా..?

0
87

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో బాలికలకు ఉన్నత గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కలెక్టర్‌  గంధం చంద్రుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఒక్కరోజు అధికారులుగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించారు. ఎంపికైన బాలికల్లో ఇంటర్‌  చదువుతున్న విద్యార్థిని శ్రావణి ఒక్కరోజు జిల్లా కలెక్టర్‌  గా బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్  గంధం చంద్రుడు, జాయింట్  కలెక్టర్  నిశాంత్  కుమార్‌ తో పాటు ఇతర జిల్లా అధికారులు విద్యార్థిని శ్రావణిని స్వయంగా ఆహ్వానించి, కలెక్టర్  కుర్చీలో కూర్చోబెట్టారు. దిశ చట్టం కింద నమోదైన కేసులో బాధిత బాలికకు పరిహారం ఇచ్చే దస్త్రంపై ఒక్కరోజు కలెక్టర్  శ్రావణి సంతకం చేశారు. ఒక్కరోజు జాయింట్‌  కలెక్టర్లుగా మధుశ్రీ, సహస్ర బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో తహసీల్దార్లుగా బాలికలు ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా కలెక్టర్  మొదలు, జేసీ, ఆర్డీవో, తహసీల్దార్‌  తో పాటు సమాచార పౌరసంబంధాల అధికారి, ఇతర శాఖల అధికారుల బాధ్యతలను బాలికలే చేపట్టారు. కలెక్టరేట్‌  తో పాటు మండల కేంద్రాల్లో బాలికా దినోత్సవాన్ని ఇలా వినూత్నంగా నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here