కంగనా రనౌత్ పై దేశ ద్రోహం కేసు

0
9

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. మహారాష్ట్ర సర్కారుపై ఢీ అంటే ఢీ అంటూ పెను సంచలనంగా మారిన కంగనా రనౌత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్వీట్లు చేస్తోంది. అయితే ఆమె చేస్తున్న ట్వీట్లతో పాటు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ముంబై పోలీసులను బాబర్స్ అంటూ కంగన పోల్చడం పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here