కరోనా వైరస్‌కు డాక్టర్ రెడ్డీస్ మెడిసన్…

0
77

కరోనాకు పూర్తి స్థాయిలో మందు ఇంకా సిద్ధం కాలేదు. అయితే యాంటీ వైరల్ డ్రగ్స్ రెమిడిసివిర్, ఫావిపిరవిర్ కరోనాను ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే రుజువయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఔషధాలను పలు కంపెనీలు ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే పలు కంపెనీలు రెమిడిసివిర్, ఫామిఫిరవిర్ టాబ్లెట్లు, ఇంజెక్షన్‌లను విడుదల చేయగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కూడా కరోనా టాబ్లెట్లను ప్రకటించింది. అవిగాన్ (Avigan) బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్‌ మార్కెట్స్‌ సీఈవో ఎంవీ రమణ తెలిపారు.

ఇది ప్రాథమిక స్థాయి నుంచి మధ్యస్థాయి వరకు లక్షణాలున్ల రోగుల చికిత్సలో మెరుగ్గా పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా కొవిడ్‌ బాధితుల్లో తమ ఔషధాన్ని ప్రయోగించగా 74 శాతం వారం రోజుల్లో కోలుకున్నట్లు వెల్లడించారు. 88 శాతం మంది 14 రోజుల్లోనే కోలుకున్నట్లు తెలిపారు. ఇక ఒక్కో అవిగాన్ ట్యాబ్లెట్‌ రూ.99 విలువ ఉంటుందని.. 122 ట్యాబ్లెట్ల కోర్సుగల ప్యాకేజీతో మార్కెట్లో లభ్యమవుతుందని తెలిపింది డాక్టర్ రెడ్డీస్. దేశవ్యాప్తంగా 42 నగరాల్లో ఉచితంగా హోమ్ డెలివరీ చేసేందుకు పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్‌ ఫార్మా తయారుచేసిన ఫావిపిరవిర్‌ కాండిడేట్‌ను దిగుమతి చేసుకొని అవిగాన్‌ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. అయితే జపాన్‌ నుంచి ఏపీఐ, డ్రగ్‌ ఫార్ములేషన్‌ సంబంధించిన టెక్నాలజీని పూర్తిస్థాయిలో పొందిన తర్వాత దేశీయంగానే ఫావిపిరవిర్ ఔషధాన్ని ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తామని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. కరోనా చికిత్సలో ఉపయోగించే మరో యాంటి వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌‌ని సెప్టెంబర్‌ మొదటి వారంలో విడుదల చేస్తామని ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here