కవితకు మంత్రి పదవి ఖాయమేనా..?

0
44

ఇందూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత.. దాదాపు ఏడాదిన్నర తర్వాత అక్కడే విజయంతో తన సత్తా చాటారు. ఇప్పుడు అందరిలో ఒకటే ప్రశ్న. కవితకు మంత్రి పదవి ఖాయమనే మాట టీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యీ ఎన్నికల్లో పోటీ అనేది కేవలం నామ మాత్రమే అని అంతా భావించారు. కవిత టార్గెట్ మంత్రిపదవి అని.. అందుకే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారనే మాట కూడా జోరుగా వినిపిస్తోంది.

కవితను మంత్రివర్గంలోకి తీసుకొనేందుకు కేసీఆర్ సుముఖంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో నియోజకవర్గాల ప్రకారం కేవలం 17 మందికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉంది. ఇప్పుడు సరిగ్గా అంతేమందితో ప్రభుత్వం కొలువుదీరి ఉన్నది. మరీ కవిత్ ఇన్.. అంటే ఎవరూ ఔట్ అనే చర్చ జరుగుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలను తీసి పక్కనపెట్టే సాహసం కేసీఆర్ చేస్తారా..? లేదంటే ఎవరినీ పక్కనపెడతారనే అంశం చర్చకు దారితీసింది.

అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవీ మరో 15 నెలల్లో ముగియనుంది. 2022 జనవరితో పదవీకాలం పూర్తవనుంది. దీంతో కవితను ఈ సమయానికే మంత్రివర్గంలోకి తీసుకుంటారా..? ఒకవేళ తీసుకుంటే తర్వాత పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న తలెత్తుతోంది. అలా కాకుండా ఎమ్మెల్సీ అయినందున.. క్యాబినెట్ ర్యాంక్ గల పోస్ట్ ఇస్తారా అనే వాదన వినిపిస్తోంది. కానీ దీనికి కవిత సహా ఇతరులు అంగీకరిస్తారా లేదా అనే ప్రశ్న వస్తోంది. కానీ క్యాబినెట్‌లోకి వచ్చేందుకు కవిత సుముఖంగా ఉన్నారనే చర్చ జరగడం.. ఎమ్మెల్సీ ఎన్నిక కావడం జరిగిపోయింది. దీంతో ఆమె నామినెటేడ్ పదవీ తీసుకొనేందుకు ఇష్టపడరని సన్నిహితుల ద్వారా తెలిసింది.

కవిత ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు.. ఆమె మంత్రి అవుతారా, లేదంటే నామినెటెడ్ పోస్ట్ అప్పగిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై గులాబీ బాస్ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొనున్నారనే టెన్షన్ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here