కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం

0
70

గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు తంగేడుమల్లి మేజర్‌ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రొంపిచర్ల – సుబ్బాయపాలెం మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతి వేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here