కృష్ణమ్మ పరవళ్లు…

0
206

ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి 49,895 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల జలాశయానికి 60వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.440 మీటర్లకు చేరింది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ9.500 టీఎంసీలుగా ఉంది. దీంతో జూరాల జలాశయం నుంచి 55వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here