కోలుకున్న వెంకయ్య… త్వరలో విధులకు హాజరు

0
26

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు కొవిడ్ నెగిటివ్ వచ్చింది. సెప్టెంబర్ 29న నిర్వహించిన కరోనా పరీక్షల్లో వెంకయ్యనాయుడుకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఎలాంటి లక్షణాలు లేకపోవడం.. తీవ్రత కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. 14 రోజుల హోమ్ క్వారంటైన్ తర్వాత తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వెంకయ్యనాయుడుకు కరోనా నెగిటివ్ అని తేలింది. పూర్తిగా కొలుకున్న ఉప రాష్ట్రపతి తిరిగి విధుల్లో చేరుతారని అధికారులు వెల్లడించారు.

కరోనా సంక్రమణ సమయంలో అవసరమైన ఆరోగ్య సేవలందించిన వైద్యులు, ఇతర వైద్యసిబ్బందికి వెంకయ్య నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. తనకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన వ్యక్తిగత సహాయకులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

స్వీయనిర్బంధంలో ఉన్న సమయంలో ఎంతో మంది తన ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేశారని… అన్ని ప్రాంతాలు, పార్టీలు, మతాలకు అతీతంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అనేక మంది ప్రార్థనలు చేశారని…. వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ వెంకయ్య వెల్లడించారు.

కరోనా సంక్రమణ అనంతరం వైద్యుల సూచన మేరకు స్వీయనిర్బంధ కాలం పూర్తయిందని…. ఎయిమ్స్ బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చిందని వెంకయ్య స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని…. అయినప్పటికీ వైద్యులు సూచించిన జాగ్రత్తలు మరికొంతకాలం కొనసాగించడం మంచిదని భావిస్తున్నా అంటూ ట్విట్టర్ లో వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here