గంటాతో టీడీపీ తెగదెంపులు చేసుకుందా..?

0
82

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే… అందరి సమాధానం ఒకటే… ఏమో అంటారు. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కూడా ప్రస్తుతం అనుమానమే. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత గంటా శ్రీనివాసరావు ఒక్కసారి కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న లేదు. అధ్యక్షుని పర్యటన సమయంలో కూడా గంటా జాడ లేకుండా పోయారు. అదే సమయంలో పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది కూడా.

టీడీపీ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు మంత్రిగా కూడా పనిచేసిన గంటా.. కడప, విజయనగరం వంటి జిల్లాలకు ఇంచార్జి మంత్రిగా కూడా సేవలు అందించారు. ఒక విధంగా టీడీపీలో ఆయన బిగ్ షాట్.

అటువంటి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ తెగదెంపులు చేసుకుందా అంటే… అవుననే అనిపిస్తోంది. విశాఖలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమంలో గంటా ఊసు కూడా లేదు. పార్టీ ప్రకటించిన పార్లమెంట్ ప్రెసిడెంట్ల పదవులను అందుకున్న వారు ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖ జిల్లా పార్టీ ఇంచార్జి హోదాలో మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. విశాఖ జిల్లాలోని ఇద్దరు మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు.

నగరం నడిబొడ్డిన ఉన్న పార్టీ ఆఫీస్ లో ఈ కార్యక్రమం జరిగితే గంటా శ్రీనివాసరావు వంటి అతి ముఖ్య హాజరు కాకపోవడం మాత్రం పలు సందేహాలకు తావు ఇస్తోంది. ఈ విషయం చూసిన వారంతా టీడీపీతో గంటాకు అధికారికంగా విడాకులు అయిపోయాయా అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. 

గంటా చాలా కాలంగా టీడీపీ కార్యక్రమాల్లో కనిపించడంలేదు. చివరికి పార్టీ ఆధ్వ‌ర్యంలో జరిగిన కార్యక్రమంలో కూడా గంటా శ్రీనివాసరావు పాలుపంచుకోకపోవడం రాజకీయంగానే చర్చకు తావిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here