గన్నవరం ‘రాజీ’కీయం

0
70

కృష్ణా జిల్లా పునాదిపాడులో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్… రాజకీయ విభేదాలకు చెక్ పెట్టేందుకు కూడా యత్నించారు. గన్నవరం నియోజకవర్గంలో కొంతకాలంగా కొనసాగుతున్న గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుతో కాసేపు ముచ్చటించారు. ఇద్దరికీ ఒకరితో ఒకరికి షేక్ హ్యాండ్ ఇప్పించారు. ఇద్దరు కలిసి ఉండాలంటూ కామెంట్ చేశారు. వంశీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని నాలుగు రోజుల క్రితమే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరి మధ్య దూరం తగ్గించేలా జగన్ ప్రయత్నించారు.

గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ చేతిలో యార్లగడ్డ వెంకట్రావు 700 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్యా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అలాంటి తరుణంలో టీడీపీ నుంచి గెలిచిన వంశీని జిల్లా మంత్రులు కొడాలినాని, పేర్ని నాని సాయంతో జగన్‌ వైసీపీలోకి తీసుకొచ్చారు. జగన్‌ను కలిసిన తర్వాత టీడీపీపై నిప్పులు చెరుగుతూ ప్రభుత్వానికి అండగా వంశీ మాట్లాడుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో ప్రత్యర్ధిగా ఉన్న యార్గగడ్డతో పాటు మరో ప్రత్యర్ధి దుట్టా రామచంద్రరావు వర్గాన్ని దూరం పెడుతున్నారు. దీంతో ఈ ముగ్గురి మధ్య మూడు మక్కలాట కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో గన్నవరంలోని పునాదిపాడు పాఠశాలకు విద్యాకానుక కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైన జగన్.. వంశీ, యార్గగడ్డ ఇద్దరినీ పలుకరించారు. ఇద్దరినీ పరస్పరం షేక్‌ హ్యాండ్‌ ఇప్పించారు. విభేదాలు వీడి పార్టీ కోసం పనిచేయాలని ఇద్దరినీ కోరారు. జగన్‌ సమక్షంలోనే వంశీ, యార్గగడ్డ షేక్ హ్యాండ్‌ ఇచ్చుకోవడంతో కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే మరో నేత దుట్టా రామచంద్ర రావు మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here