జైలులో ఆత్మహత్య చేసుకున్న ఎమ్మారో

0
265

కోటి రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్‌ చేసింది. అయితే చంచలగూడ జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.కోటి 10 లక్షల లంచం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. నెలరోజులుగా ఈ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ల్యాండ్ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులకు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం లభించడంతో అతడ్ని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయనతో పాటు వీఆర్ఏ సాయి రాజ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఓ భూమికి సంబంధించి రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా, కీసర ఎమ్మార్వో నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎస్ రావు నగర్‌లోని తన నివాసంలోనే ఆయన లంచం తీసుకుంటుండగా అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో వెంటనే నాగరాజు ఇల్లు, ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇంత భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో పట్టుబడడం పెద్ద సంచలనంగా మారింది. కీసర ఎమ్మార్వో పరిధిలోకి వచ్చే రాంపల్లిలో 28 ఎకరాల భూమికి సంబంధించి వివాదం ఉన్నట్టు తెలిసింది. ఆ భూ వివాదాలకు క్లియర్ చేసేందుకు నాగరాజు భారీ ఎత్తున లంచం డిమాండ్ చేశారని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here