దసరా.. లేక దీపావళి.. ఎప్పటి నుంచో అనుమతులు మరి..?

0
30

కరోనా కారణంగా బాగా దెబ్బ తిన్న పరిశ్రమ ఏదైనా ఉందంటే అది సినీ రంగం మాత్రమే. లాక్ డౌన్ కారణంగా మూతపడిన సినిమా ధియేటర్లు ఇప్పటికే తెరుచుకోలేదు. ప్రతి నెలా అన్ లాక్ మార్గదర్శకాలను విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం… ధియేటర్లకు మాత్రం నో చెబుతోంది. అయితే తాజాగా విడుదల చేసిన అన్ లాక్ 5 మార్గదర్శకాల్లో మాత్రం 50 శాతం ప్రేక్షకులతో ధియేటర్లకు అనుమతి ఇచ్చింది.

అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు తెరుచుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఇది రాష్ట్రాల పరిస్థితులు, ఆదేశాల మేరకు లోబడి వుంటుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీనికి ఓకే చెప్పగా… మరికొన్ని మాత్రం సైలెంట్ గా ఉన్నాయి.

ఏ విషయం చెప్పని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా వుంది.  ఆంధ్రలో అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే కరోనా ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. దాదాపు పరిక్షల్లో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. స్కూళ్లకు అక్టోబర్ అంతా సెలవులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు అనుమతి ఇవ్వటం అన్నది ఎంతవరకు సబబు అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది.

ప్రస్తుతం థియేటర్ల కరెంట్ బిల్లులు రద్దు చేయాలనే విన్నపం అలాగే వుంది. దాని మీద ఇంకా ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదు. పేదలు, మధ్య తరగతి ప్రజలు కరోనా టైమ్ లో నానా బాధలు పడి కరెంట్ బిల్లులు కట్టారు. ఇన్నాళ్లూ లక్షలు, కోట్లు ఆర్జించిన థియేటర్ యజమానులు కరోనా టైమ్ లో బిల్లులు రద్దు చేయాలని అడగడం ఎంత వరకు సబబు అనే విమర్శలు కూడా వున్నాయి. దీని మీద కూడా జగన్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారా? అన్నది అనుమానమే. 

ఇలాంటి నేపథ్యంలో అక్టోబర్ నెలలో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఎంత వరకు వుంటాయో చూడాలి. నైజాంలో తెరుచుకుని, ఆంధ్రలో తెరవకుంటే కొత్త సినిమాల విడుదల వుండదు. కనీసం అక్టోబర్ 20 నుంచి థియేటర్లకు అనుమతి ఇస్తే కనుక దసరాకు కొత్త సినిమాలు వుండొచ్చు. లేదూ అంటే ఇక మిగిలింది దీపావళి విడుదలే. దానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here