దుబ్బాక.. గుర్తులతో తలనొప్పి

0
27

దుబ్బాక ఉప ఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు గుర్తుల భయం పట్టుకుంది. గత ఎన్నికలలో మాదిరిగా.. ఎలక్షన్లలో పాల్గొనే అభ్యర్థులకు ట్రక్కు, జెసిబి, ఆటో రిక్షా లాంటి గుర్తులు వస్తే అధికార పార్టీకి ముప్పు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలో జరగబోయే ఎలక్షన్లలో 30 మందికి పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో అధికార పార్టీ వర్గాల్లో ఆందోళన ఎక్కువవుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ట్రక్కు, ఆటో రిక్షా, ట్రైన్ లాంటి గుర్తులు వస్తే అది ప్రతిపక్షాలకు అనుకూలంగా మారే అవకాశం.

2018 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలలో 9 టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కైవసం చేసుకోగా.. అందులో సంగారెడ్డిలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పోలీస్ రాంచందర్ కు ట్రక్కు గుర్తు రావడం తో అధికార పార్టీ నాలుగు వేల తేడాతో ఓటమి పాలైంది. మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్.. ట్రక్కు గుర్తు కారణంగా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నాలుగు వేల ఓట్లతో గెలుపొందారు.

ఇలాంటి గుర్తులు దుబ్బాక బై ఎలక్షన్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు వస్తే అధికార పార్టీకి చుక్కెదురు అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉంటారో వారి గుర్తులను ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు.

టీఆర్ఎస్ గతంలోనూ ట్రక్కు గుర్తుల కారణంగా పలు సందర్భాల్లో ఓటమి పాలవడం, లేదంటే ఓడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రమంతా టీఆర్ఎస్ గాలి వీచినా.. ఖమ్మంలో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా అక్కడ నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావే ఓడిపోయాడు. ఇదొక్కటే గాక.. మంథనిలోనూ పుట్ట మధు కూడా ట్రక్కు గుర్తు కారణంగానే ఓటమి పాలయ్యాడని అధికార పార్టీ అప్పట్లో ఆరోపణలు చేసింది. గత పరిస్థితుల నేపథ్యంలో ట్రక్కుల గుర్తులు వస్తే..అది టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here