నగదు బదిలీ నిధులు విడుదల

0
78

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం కింద నగదు బదిలీ అమలుకు సంబంధించి ముందడుగు వేసింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు సంబంధించి సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ ఉచిత విద్యుత్‌ సబ్సిడీని నేరుగా రైతు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుపై ఏమాత్రం భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. రైతు ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము చేరిన తర్వాతే దాన్ని విద్యుత్‌ సంస్థకు పంపుతామని స్పష్టం చేసింది. ఆ దిశగా తొలి అడుగు పడింది. ముందుగా శ్రీకాకుళం జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసింది.

2020–21లో వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి రూ.8,353.70 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్‌ లోడ్, కనెక్షన్లను బట్టి నగదు బదిలీకి అయ్యే వ్యయాన్ని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ లెక్కగట్టింది. జిల్లాలో మొత్తం 25,971 వ్యవసాయ పంపుసెట్లు ఉండగా.. వీటి వినియోగ సామర్థ్యం 1,02,963 హార్స్‌పవర్‌ (హెచ్‌పీ). ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన ప్రకారం ఒక్కో యూనిట్‌ ధర రూ.6.58. ఈ లెక్కన సెప్టెంబర్‌ నెలలో విద్యుత్‌ సబ్సిడీ రూ.6.05 కోట్లు ఉంటుందని ఈపీడీసీఎల్‌ లెక్కగట్టింది. ఈ మొత్తం రైతు ఖాతాల్లోకే వెళుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here