నిరాడంబరంగా….

0
54

యంగ్ హీరో నితిన్, శాలినిల నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. కరోనా నిషేధాజ్ఞలతో ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోను నితిన్‌ ట్వీట్‌ చేశారు. ఈ నెల 26న జరిగే వివాహ వేడుకతో ఈ ప్రేమజంట ఒకటి కానుంది. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులు, అతిథుల సమక్షంలో వేడుక నిర్వహించనున్నారు. 26న రాత్రి 8.30 గంటలకు ప్రఖ్యాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పెళ్లి జరుగుతుంది. దీనికి సంబంధించి నితిన్‌ కుటుంబం ఇప్పటికే అతిథులకు శుభలేఖలు అందించింది. వీరి పెళ్లి ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉండగా, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు.

నితిన్ ఈ ఏడాది ‘భీష్మ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ప్రస్తుతం ‘రంగ్‌ దే’, ‘అంధాదున్‌‌’ రీమేక్‌తో పాటు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు దర్శకుడు కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ అనే సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here