పానీపూరీ టూ ఐపీఎల్… యశస్వీ జైస్వాల్

0
50

ఐపీఎల్ మజా ఏమిటో ఇప్పటికే రుజువైంది. దాదాపు 6 నెలలుగా ఎలాంటి మ్యాచ్ లు లేకుండా నిస్తేజంగా క్రికెట్ లవర్స్ కు ఐపీఎల్ అసలు సిసలు మజా రుచి తెలిసింది. ముంబైతో చెన్నై తొలి మ్యాచ్ ఉత్కంఠగా సాగగా… రెండో మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఢిల్లీ విజయం సాధించింది. బెంగళూరు, హైదరాబాద్ మ్యాచ్ కూడా నువ్వా, నేనా అన్నట్లు సాగింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో పోరుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైంది. తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ తన అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. రాజస్థాన్ రాయల్స్‌కు ఈ సారి యశస్వీ జైస్వాల్ రూపంలో తురుపు ముక్క దొరికిందనే చెప్పాలి. ఇంతకీ ఎవరీ యశస్వీ జైస్వాల్..?

ఐపీఎల్.. బిగెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆన్ ఎర్త్.. ఈ మెగా టోర్నీ ఎంతో మంది గల్లీ క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది. ఆటగాళ్ల టాలెంట్‌ ఈ మెగా టోర్నీ ద్వారా బయటపడి ఏకంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే గోల్డెన్ ఛాన్స్ వారికి దక్కిందంటే ఇది ఐపీఎల్ పుణ్యమే. ఈ క్యాష్ రిచ్ గేమ్‌ ఎంతో మంది పేద క్రికెటర్లను ఓ స్థాయికి తీసుకెళ్లింది. టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఎదురుచూస్తున్న ఎందరో యువక్రికెటర్లు ఈ టోర్నీ ద్వారా తమ భవిష్యత్తును బంగారు మయం చేసుకున్నారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ టోర్నీలో అందరి కళ్లు రాజస్థాన్ రాయల్స్ జట్టులోని యశస్వీ జైస్వాల్ పైనే ఉన్నాయి.

భారత్‌ తరపున అండర్ -19 ఆడిన ఈ యువకెరటం దిశ ఐపీఎల్‌తో ఒక్కసారిగా మారిపోయింది. ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో జైస్వాల్ తప్పకుండా రాణిస్తాడని చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. క్వారంటైన్ సమయంలో తాను యోగా, ఇతర వ్యాయామాలు చేసి తనను తాను పూర్తిగా ఫిట్ గా ఉండేలా చూసుకున్నాడని కోచ్ జ్వాలా సింగ్ చెప్పాడు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కావాలన్న తన సుదీర్ఘ స్వప్నం ఐపీఎల్‌తో నిజం కాబోతోందని చెప్పాడు.

పానీపూరీలు అమ్ముకునే స్థాయి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే స్థాయికి జైస్వాల్ ఎదగడంపై కోచ్ హర్షం వ్యక్తం చేశాడు. అండర్ -19 టీ20 వరల్డ్ కప్‌‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును 18 ఏళ్ల జైస్వాల్ గెలుచుకున్నాడు. ఇతని ఆటతీరు చూసిన రాజస్థాన్ రాయల్స్ వేలంపాటలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రూ.2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో జైస్వాల్ జాతకమే మారిపోయింది. యశస్వీ జైస్వాల్ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే.. క్రికెట్ కోసం ముంబై వచ్చి ఓ వైపు పానీపూరీ అమ్ముతూనే… మరోవైపు క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ వేలం సమయంలోనే న్యూస్ మేకర్ గా నిలిచిన యశస్వీ జైస్వాల్ ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.. ఆల్ ది బెస్ట్ యశస్వీ జైస్వాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here