పాపం రాజస్థాన్… డివిలియర్స్ డెవిల్ షో

0
23

ఐపీఎల్ లో రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. టోర్నీలో ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ … 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉతప్ప, బెన్‌  స్టోక్స్‌  మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. భారీ స్కోరు దిశగా వెళ్తున్న రాజస్థాన్ ను చాహల్‌ అడ్డుకున్నాడు. 8వ ఓవర్‌  లో ఉతప్ప, సంజూ శాంసన్‌ ను ఔట్‌  చేశాడు. ఆ తర్వాత జోస్‌ బట్లర్‌, స్టీవ్‌  స్మిత్‌ నిలకడగా ఆడి జట్టు స్కోరును గాడిలో పెట్టారు. వీరిద్దరూ కలిసి టీమ్ స్కోరును వంద రన్స్ దాటించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో స్మిత్ 57 రన్స్ చేయగా.. ఉతప్ప 41 పరుగులు చేశాడు.

178 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టార్‌ బ్యాట్స్‌  మన్‌  ఏబీ డివిలియర్స్‌ విధ్వంసకరంగా బ్యాటింగ్‌  చేయడంతో చివరి ఓవర్ లో ఆర్సీబీ లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్‌  విరాట్‌  కోహ్లీ 43 రన్స్ చేయగా.. దేవ్‌  దత్‌  పడిక్కల్‌ 35 రన్స్ చేసి అవుటయ్యారు. 13వ ఓవర్ లో క్రీజ్ లోకి వచ్చిన ఏబీ డివిలియర్స్… సిక్సర్ల మోత మోగించాడు. 22 బంతుల్లోనే 6 సిక్సర్లు, ఒక ఫోర్ తో 55 రన్స్ చేశాడు. చివరి పది బంతుల్లో 24 రన్స్ చేసిన ఏబీ… మరో రెండు బాల్స్ మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో 3 స్థానంలో నిలవగా.. రాజస్థాన్ 6 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here