పామాయిల్.. రోగాలకు దగ్గర దారి..

0
83

హోటళ్లలో, చాలా రెస్టారెంట్లలో, కొంత మంది ఇళ్లలో ఎక్కువగా వాడుతున్నది పామ్ అయిలే. ఇది ఎంత ప్రమాదకరమైనదంటే… మద్యం, స్మోకింగ్ ఆ రెండూ కలిపితే వచ్చే నష్టాల కంటే… పామ్ ఆయిల్ వాడటం వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ. మీకు తెలుసా… ప్రపంచంలో పామ్ ఆయిల్‌ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారతే. ఈ పామ్ ఆయిల్ వెనక పెద్ద మాఫియా ఉందంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం దేశంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ పామ్ ఆయిల్‌నే వాడుతున్నాయి. కారణం… మిగతా వంట నూనెల కంటే పామ్ ఆయిల్ ధర తక్కువగా ఉండటమే. ఐతే… పామ్ ఆయిల్‌తో కలిగే నష్టాలు తెలియక చాలా మంది ఈ నూనెతో చేసిన వంటకాల్ని తినేస్తున్నారు

ఆశ్చర్యకరమైన విషయమేంటంటే… పెద్ద పెద్ద కంపెనీల్లో బిస్కెట్లు, కుకీల తయారీకి పామ్ ఆయిల్‌నే వాడుతున్నారు. చాకొలెట్స్ తయారీలో కూడా అదే. మనందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ పామ్ ఆయిల్ లేదా పాల్మిటిక్ యాసిడ్ (Palmitic acid) మన ప్రాణాలు తియ్యగలదని మనకు తెలియదు. షాకింగ్ విషయమేంటంటే… లేస్ (Lays) లాంటి కంపెనీలు… విదేశాల్లో వేరే వంట నూనె వాడుతూ… ఇండియాలో అమ్మే ఉత్పత్తులకు మాత్రం పామ్ ఆయిల్‌ని వాడుతున్నాయి. ఈ పామాయిల్‌తో చేసినవి తిన్న ప్రతిసారీ పిల్లల బ్రెయిన్ దెబ్బతింటూనే ఉంటుంది. అంతేకాదు… పామాయిల్ వల్ల గుండె జబ్బులు వస్తాయి. చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు.

ప్రపంచ ఆర్థిక సంస్థ (The World Economic Form) అంచనా ప్రకారం… ప్రపంచంలో చనిపోతున్న జనాభాలో సగం మంది డయాబెటిస్, గుండె జబ్బుల వల్లే చనిపోతున్నారు. పామ్ ఆయిల్ మాఫియా అనేది… ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్నీ నాశనం చేస్తోంది. ఇది జంక్ ఫుడ్‌కి ప్రజలు అలవాటు పడేలా చేసి… పండ్లు, కూరగాయలను తిననివ్వకుండా దూరం చేస్తోంది. గుండెను కాపాడే అవి… దూరమై… పామాయిల్ వల్ల బాడీలో కొవ్వు పేరుకుపోయి… అడ్డమైన రోగాలూ వస్తున్నాయి.

ఈసారి మీరు పిల్లలకు ఏమైనా కొనేటప్పుడు ఆ వస్తువుల్లో పామ్ ఆయిల్, పాల్మొలినిక్ ఆయిల్, పాల్మిటిక్ యాసిడ్ వంటివి కలిపినట్లు ఉంటే అస్సలు కొనవద్దంటున్నారు డాక్టర్లు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా లక్ష మంది డాక్టర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాయాలని నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here