పెరుగుతున్న బంగారం ధరలు

0
65

అంతర్జాతీయ అంశాలు… బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగడంతో… బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశాలున్నాయి.

బంగారం ధరలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం బాగా కనిపిస్తోంది. ఈసారి కచ్చితంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతారని సర్వేలు చెబుతుండటంతో… ఇన్వెస్టర్లు ఒకింత ఆందోళన చెందుతున్నారు. కొత్తగా జో బిడెన్ ప్రభుత్వం వస్తే… ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, అవి బంగారం ధరలపై నెగెటివ్ ప్రభావం చూపిస్తాయేమో అని ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు కంటిన్యూగా 4 రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు ఇండియాలో పండగ సీజన్ వస్తుండటమే కారణంగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజల దగ్గర ఆదాయం పెరుగుతుండటంతో… డబ్బును సేవింగ్స్‌గా మార్చుకోవడానికి కొంత మంది బంగారాన్ని కొంటున్నారు. ఫలితంగా ధర క్రమంగా పెరుగుతోంది.

నేటి బంగారం ధరలు (12-10-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,820 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ 22 క్యారెట్ల బంగారం రూ.10 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.53,250 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 పెరిగింది.

నేటి వెండి ధరలు (12-10-2020): వెండి ధరల్లో… సెప్టెంబర్ 24 నుంచి ఒక రోజు తగ్గితే, మరో రోజు పెరుగుతున్నాయి. మొత్తంగా పెరుగుదలే కనిపిస్తోంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.62,910 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ వెండి ధర రూ.10 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.503.28 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ తులం వెండి ధర రూ.0.08 పెరిగింది. పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల ధర కూడా పెరుగుతోంది. సెప్టెంబర్ 15న వెండి ధర అత్యధికంగా… రూ.69,500 పలికింది. అందువల్ల రోజువారీ ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయంటున్నారు.

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఏడాది కాలంలో… ఆగస్ట్ 8 వరకూ బంగారం ధర పెరుగుతూ వచ్చింది. ఆగస్ట్ 8న అత్యధికంగా నగల బంగారం ధర రూ.53,800 పలికింది. ఆ తర్వాత… సెప్టెంబర్ 24న అతి తక్కువ ధర నమోదైంది. ఆ రోజు… నగల బంగారం ధర రూ.47,550 నమోదైంది. ఇప్పుడు మళ్లీ పెరుగుదల ట్రెండ్ కనిపిస్తోంది. పండుగల సీజన్ వచ్చేస్తోంది కాబట్టి… బంగారానికి డిమాండ్ పెరగడం ఖాయం. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here