పెళ్లి పీటలెక్కనున్న చందమామ ముద్దుగుమ్మ

0
109

చంద్రమామ భామ కాజల్ అగర్వాల్ కి పెళ్లి కళ వచ్చింది. త్వరలో పెళ్లి పీటలెక్కనుంది ఈ ముద్దుగుమ్మ. వ‌య‌సు 30 దాటినా కూడా ఇప్ప‌టికీ వ‌రుస సినిమాల‌తో స్టార్ హీరోయిన్ హోదా అనుభ‌విస్తోంది కాజ‌ల్. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న జీవితంలో పెళ్లి అనే టాపిక్ రాలేద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లే కనిపిస్తుంది. ఆమె పెళ్లి గౌతమ్ కిచ్లు అనే బిజినెస్ మేన్‌తో ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతుంది. కాజల్ కూడా ఈ పెళ్లికి ఓకే చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో కాజల్ ఇంటి దగ్గరున్న ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో పెళ్లి ఘనంగా జరగబోతుందని ప్రచారం జరుగుతోంది.  

గౌతమ్, కాజల్ స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుంటున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్న వార్త. ఇద్దరూ కలిసి కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లోనే చదువుకున్నారు. ఆ తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో.. ఆ తర్వాత ఇన్ సీడ్‌లో చదువుకున్నారని తెలుస్తుంది. అప్పట్నుంచే ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గౌతమ్ కిచ్లు డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అని తెలుస్తుంది. మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాకుండా.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ కాజల్ సన్నిహితులు చెప్తున్న మాట. డిసెర్న్ లివింగ్ మొదలు పెట్టక ముందు, ఫ్యాబ్ ఫర్నిష్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా.. అలాగే లైఫ్ స్టైల్ బ్రాండ్ – ద ఎలిఫెంట్ కంపెనీకి సీఈఓగా కూడా పని చేసినట్లు తెలుస్తుంది. కాజల్ పెళ్లి ఓ వ్యాపార వేత్తతో జరగనుందని చాలా రోజులుగా చర్చలు అయితే జోరుగానే జరుగుతున్నాయి. అతడే గౌతమ్ అని ఇప్పుడు బయటికి వచ్చింది. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తైన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా కూడా కాజల్ అగర్వాల్ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.

ప్రస్తుతం కాజల్  చేతిలో చాలా సినిమాలున్నాయి. ప్రస్తుతం త‌మిళ‌నాట కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. శంకర్ సినిమా కాబట్టి క‌చ్చితంగా మ‌రో ఏడాది పాటు అక్క‌డే లాక్ కావ‌డం ఖాయం. దాంతోపాటు చిరంజీవి ఆచార్యలో కూడా నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here