పోలవరం ప్రాజెక్టలో కీలక పరిణామం… టార్గెట్-2022

0
41

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కారు పనుల వేగాన్ని పెంచింది. ఇప్పటికే గర్డర్ల బిగింపు పూర్తవుతుండగా.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది.

2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చిన రోజే వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ముందుగా రివర్స్ టెండరింగ్ నిర్వహించిన ప్రభుత్వం.. సుమారు రూ.58 కోట్లు ఆదా చేసింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న నవయుగ సంస్థను తొలగించి… రివర్స్ టెండరింగ్ లో పనులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థకు పనులు అప్పగించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించింది.

 పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కారు పనుల వేగాన్ని పెంచింది. ఇప్పటికే గర్డర్ల బిగింపు పూర్తవుతుండగా.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో కీలకమైన గ్యాప్‌ 1 డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రధాన డ్యామ్‌ లో కీలకమైన డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా.. అందులో గ్యాప్‌ 1 నిర్మాణ పనులను నిర్మాణసంస్ధ మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు ప్రారంభించారు. మొత్తం 450 మీటర్ల పొడవైన ఈ డయాఫ్రమ్‌ వాల్‌ ప్రధాన డ్యామ్‌ కు కీలకమైనదని చెబుతున్నారు. ఇది కూడా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామే. ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ తో నిర్మించే ఈ డయాఫ్రమ్ వాల్‌ లో మొత్తం 89 ప్యానెల్స్‌ ఉంటాయి. సాధ్యమైనంత త్వరగా వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు మేఘా ఇంజనీరింగ్‌ సంస్ధ శ్రమిస్తోంది.

ఏపీలో అల్పపీడనం కారణంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద పనులకు కూడా అంతరాయం కలుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు పోటెత్తింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. అయినా వర్షం మధ్యలోనే డయాఫ్రమ్‌ వాల్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు అధికారులతో పాటు….. మేఘా ఇంజనీరింగ్‌ సంస్ధ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధించిన గడువు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here