ప్రాణాలతో పోరాడుతున్న యువ హీరో

0
160

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి అత్యంత గడ్డుకాలం నడుస్తోంది. ఏ నిమిషానికి ఏ వార్త వినాలో అని అంతా భయపడుతున్నారు. ఓ వైపు కరోనాతో షూటింగ్ లు లేక పరిశ్రమ నానా పాట్లు పడుతోంది. ఇదే సమయంలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అంతా భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో మరో చేదువార్త వచ్చింది. షూటింగ్ చేస్తుండగా ఓ యువ నటుడు గాయపడ్డాడు.. తీవ్రంగా గాయపడి…. ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ప్రముఖ మలయాళ నటుడు, ఫోరెన్సిక్ మూవీ ఫేమ్ టోవినో థామస్‌ తీవ్ర గాయాలతో ప్రస్తుతం కొచ్చిలోని ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ‘కాలా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఓ భారీ యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. థామస్‌కు ఇంటర్నల్‌ బ్లీడింగ్ కావటంతో పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

థామస్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. థామస్ కడుపులో బలంగా దెబ్బ తగలటంతో ఇంటర్నల్‌ బ్లీడింగ్ జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. టోవినో థామస్‌కు ప్రమాదం జరిగిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మలయాళ ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది.

థామస్ త్వరగా కోలుకోవాలంటూ థామస్ అభిమానులు కోరుకుంటున్నారు. టోవినో థామస్‌కు మాలయాళ ఇండస్ట్రీలో హీరోగా, విలన్‌గా మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల థామస్ నటించి ‘ఫోరెన్సిక్’ సినిమా తెలుగులో ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సినిమాతో థామస్ కు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here