బాబోయ్ మనిషంత ఎలుక

0
129

మనిషంత ఎలుక… ఛా ఊరుకోండి… ఎక్కడైనా మనిషంత ఎలుక ఉంటుందా.. లేక ఎలుకంత మనిషి ఉంటాడా… అని అనుకుంటున్నారా… నిజమే… రెండు అసాధ్యమే… ఓ ఎలుక మహా అయితే.. కలుగులో దూరెంత ఉంటుంది… ఇక పందికొక్కు అయితే… ఓ రెండు కేజీలుంటుంది… అంతే కానీ… ఏకంగా ఆరడుగుల ఎత్తు ఎలుక ఎలా ఉంటుంది… అదేదో సినిమాలో గ్రాఫిక్స్ అయి ఉంటుంది. నిజమే… కానీ మెక్సికోలో మాత్రం ఆరడుగుల ఎలుకను చూసి మునిసిపల్ సిబ్బంది అవాక్కైంది.

మెక్సికో నగరంలో కొద్ది రోజులుగా డ్రైనేజీలు బ్లాక్ అవుతున్నాయి. దీంతో మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీలను తనిఖీ చేయడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు నీరు బ్లాక్ అవుతున్న చోటును కనిపెట్టారు. అక్కడ ఏదో పెద్ద జీవి అడ్డుగా పడి ఉంది. దాని వల్ల డ్రైనేజీల్లో ప్రవాహం ఆగిపోయింది. మురికి పట్టి ఉన్న ఆ జీవిని చూడగానే మున్సిపాలిటీ సిబ్బంది హడలిపోయారు. ఎందుకంటే.. అది ఎలుక. మనిషి సైజులో ఉన్న ఎలుక. అది కదలకుండా.. మెదలకుండా ఉంది. దీంతో అది మురుగు నీటిలో మునిగి చనిపోయి ఉంటుందని భావించారు. ఎంతో కష్టపడి దాన్ని బయటకు తీసి శుభ్రం చేసి షాకయ్యారు. ఎందుకంటే.. వారికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

మెక్సికో మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీ నుంచి 22 టన్నుల చెత్తను తొలగించారు. అందులో మనిషంత ఎత్తు గల ఎలుక కూడా ఉంది. దానిని బయటకు తీసిన సిబ్బంది పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత చూసి షాకయ్యారు. ఎందుకంటే.. అది ఎలుకే. కానీ, నిజమైన ఎలుక కాదు. ఎవరో పెద్ద సైజు ఎలుక బొమ్మను తయారు చేసి డ్రైనేజీలో పడేశారు. దాన్ని మున్సిపల్ సిబ్బంది భారీ ఎలుకగా భావించి హడావుడి చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థానికి కారణమైన వ్యక్తి కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here