బీసీ నాయకత్వంలో ఏపీ తెలుగుదేశం పార్టీ

0
42

2019 ఎన్నికల తర్వాత ఢీలా పడిన తెలుగుదేశం పార్టీని గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధినేత నడుం బిగించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన 24 గంటల్లోనే ఏపీ టీడీపీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుని నియమించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణనే కొనసాగిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో నందమూరి ఫ్యామిలీకి ప్రాధాన్యత కల్పించారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని నియమించారు. 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయగా, 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌ రావు లను నియమించారు. ఇక టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.

పొలిట్ బ్యూరో సభ్యులుగా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, కళా వెంకట్రావును నియమించారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణకు తొలిసారిగా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here