మిల్క్ బ్యూటీ తమన్నాకు కరోనా

0
64

కరోనా ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. కానీ, సినిమా వాళ్లు మాత్రం షూటింగ్ లు మొదలు పెట్టారు. మొదట్లో కొద్దిగా వెనకడుగు వేసినా ఇప్పుడు ప్రతీ ఒక్కరూ షూటింగ్ లకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఆగిపోయిన షూటింగ్ లు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి షూటింగ్ లకు రెడీ అవుతున్న సమయంలో అనూహ్యంగా కరోనా వైరస్ సోకింది. హైఫీవర్‌తో బాధపడుతున్న తమన్నా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 

ఆ సమయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. అయితే ఇన్‌ఫెక్షన్ ఎంత ఉందనే విషయం మాత్రం తెలియలేదు. కాగా ఆ మధ్యన తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా.. వారిద్దరు కోలుకున్నారు. ఇక సినిమా షూటింగ్‌ కోసం మిల్కీబ్యూటీ ఇటీవల హైదరాబాద్‌ రాగా ఆమెకు వైరస్ నిర్ధారణ అయ్యింది. 

ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్‌తో‌ పాటు ఓ వెబ్‌ సిరీస్ ఉన్నాయి. ఇందులో సిటీమార్ చిత్రం నవంబర్  నుంచి పునః ప్రారంభం కావాల్సి ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here