రూ.2 వేల నోటు ముద్రణపై ఆర్బీఐ క్లారిటీ…

0
107

2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2 వేల రూపాయల నోటును తీసుకొచ్చింది ఆర్బీఐ. ఆ తర్వాత మూడేళ్ల పాటు బాగానే సర్క్యులేషన్‌లో ఉన్నాయి. కానీ ఆ తర్వాత నుంచి గులాబీ నోటు పెద్దగా కనిపించడం లేదు. కొందరు బడా వ్యాపారులే 2 వేల నోట్లను బ్లాక్ మనీగా దాచి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో 2 వేల నోటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2019-20 సంవత్సరంలో రూ.2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లను ముద్రించలేదని ఆర్‌బీఐ వార్షిక నివేదికలో తెలిపింది. అసలు ఒక్క నోటును కూడా ప్రింట్ చేయలేదని తెలిపింది. ఇక గత కొన్నేళ్లుగా 2 వేల నోట్ల సర్క్యులేషన్‌ బాగా తగ్గిందని నివేదిలో పేర్కొంది ఆర్బీఐ.

2018 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న 2 వేల కరెన్సీ నోట్ల సంఖ్య 33,632 లక్షలు ఉండగా.. 2019 మార్చి చివరికి 32,910 లక్షలకు పడిపోయింది. ఇక 2020 మార్చి ఆఖరి నాటికి ఆ సంఖ్య 27,398 లక్షలకు తగ్గిందని ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది. 2018 మార్చి నుంచి 2 వేల నోట్లు సర్క్యులేషన్‌ క్రమంగా తగ్గుతూ వస్తోందని పేర్కొంది. 2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసిన ఆర్బీఐ.. అదే సమయంలో రూ.500, రూ.200 విలువైన కరెన్సీ నోట్ల ముద్రణను గణనీయంగా పెంచింది. దాంతో మార్కెట్లో వీటి సర్క్యులేషన్ బాగా పెరిగింది. 2 వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోవడంతో రాబోయే రోజుల్లో సామాన్యుడికి ఆ నోటు కనిపించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here