రెడీ ఫర్ వార్.. చైనా అధ్యక్షుడి పిలుపు

0
105

భారత్-చైనా సరిహద్దుల వద్ద కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల సైనికాధికారులు, విదేశాంగ అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలంటూ చైనా ఆర్మీ (పీపుల్ లిబరేషన్ ఆర్మీ) ని ఉద్దేశించి మాట్లాడారు. చైనా కొత్తగా అభివృద్ధి చేస్తున్న మెరైన్ కోర్ దళాన్ని పర్యవేక్షించిన సందర్భంగా జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

యుద్ధానికి సిద్ధంగా ఉండాలని… దేశానికి విధేయంగా పనిచేయాలని జిన్ పింగ్ పిలుపునిచ్చాడు. పూర్తి శక్తి సామర్థ్యాలను యుద్ధంపైనే కేంద్రీకరించాలని సూచించాడు. ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని య సైనిక దళాలకు స్పష్టం చేశారు.

అయితే భారత్ చైనా ల మధ్యనే గాక అమెరికాతోనూ ఆ దేశం కయ్యం పెట్టుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో జిన్ పింగ్ వ్యాఖ్యలు ఏ దేశాన్ని ఉద్దేశించి అనేది ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఒకవైపు భారత్-చైనా సరిహద్దుల వద్ద యుద్ధ మేఘాలు ఆవరిస్తున్నాయి. సైనిక దళాదికారులు చర్చలు జరుపుతున్నా.. అవి అంతగా ఫలించడం లేదు. ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు, రక్షణ మంత్రులు కూడా ఇదే విషయమై పలుమార్లు చర్చలు జరిపారు. ఇక సైనికాధికారులైతే.. ఈ ఏడాది మే నుంచి చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా అవి ఒక కొలిక్కి రావడం లేదు. మరోవైపు ఒక చోటు నుంచి కాకపోతే మరోచోటు నుంచి కయ్యం పెట్టుకోవడానికి చైనా కాలు దువ్వుతున్నది.

భారత్ లోని వాస్తవాధీన రేఖ వెలుపలకు చొచ్చుకువచ్చి ఈ భూభాగం మాదేనని చైనా మొండికేస్తున్నది. ఈ క్రమంలోనే పలుమార్లు ఘర్షణలకు కూడా దిగింది. బార్డర్ లో సైనికులను కవ్విస్తూనే.. వారి సైనిక స్థావరాలకు సమీపాన అత్యంత అధునాతనమైన యుద్ధ విమానాలను మొహరిస్తున్నది. అయితే ఈ చర్యలను భారత్ ధీటుగానే బదులిస్తోంది. లడక్ వద్ద శత్రు దేశం విమానాల రాకపోకలను నియంత్రించే విమానాలను, యుద్ధ నౌకలను అక్కడికి తరలిస్తున్నది. చర్చలు జరుగుతున్న క్రమంలోనే జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడంపై భారత్ కూడా అలర్టైంది. అవసరమైతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రధాని మోడీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు సైనిక దళాదికారులు కూడా పలుమార్లు చైనాను హెచ్చరించారు కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here