రోజా.. టార్గెట్ 2024

0
137

రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు.. ప్రత్యర్థులపైనే కాదు.. సొంత పార్టీలో.. సొంత నేతలపై కూడా ఉంటాయి. నియోజకవర్గాలు, జిల్లాల్లో పైచేయి సాధించాలనుకునే నాయకులు ఈ తరహా వ్యూహాలతో సొంత పార్టీ నేతలకే చెక్ పెడుతూ ఉంటారు. ఇదే పరిస్థితి ఇప్పుడు చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు ఎదురైనట్లుంది. జబర్దస్త్‌ షో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా.. అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపిస్తున్నారు. .. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. నోరు విప్పితే.. నిప్పులు కురుస్తాయి. ప్రతిపక్ష నేతలపై రోజా ఏ రేంజ్ లో విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పార్టీ కోసం.. అధినేత జగన్ కోసం.. ఎంతదూరమైనా వెళ్తానని చెప్పే.. రోజా.. తన కోసం.. తన రాజకీయ వ్యూహం కోసం కూడా అంతే రేంజ్‌లో దూకుడు ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం నగరిలో కె.జె. కుమార్ కుటుంబానికి రోజాకు ప్రస్తుతం పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి. దీనికి ప్రధాన కారణంగా రాజకీయంగా తనకు ఎప్పటికైనా చిక్కులు వస్తాయని.. భావించే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంగా కుమార్ కుటుంబం చక్రం తిప్పుతోంది.

ఈ విషయాన్ని గ్రహించిన రోజా.. కేజే కుమార్ కుటుంబాన్ని దూరం పెట్టారు. పైగా పలు విషయాల్లో ఘర్షణలు కూడా పడ్డారు. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డిపై పరోక్షంగా విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు రోజాను ఇరుకున పెట్టేలా.. ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రోజా వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్న కె.జె.కుమార్ భార్య శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇవ్వడం రోజా వర్గంలో కలకలం సృష్టిస్తోంది. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని బాహాటంగానే చర్చ జరుగుతోంది.

గతంలో తన ఓటమి కోసం పనిచేసిన వారికి రాష్ట్రస్థాయి పదవి ఇస్తారా అని రోజా మండిపడుతున్నారట. అయితే కుమార్ వెనుక ఏకంగా పెద్దిరెడ్డి ఉండడంతో రోజా దూకుడుకు బ్రేకులు పడుతున్నాయని, వచ్చే ఎన్నికల నాటికి ఆల్టర్నేట్ అయినా అయిపోవచ్చని స్థానిక నేతలు అంటున్నారు. కానీ జగన్ మాత్రం రోజా విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని ఇప్పటికే రోజా వర్గం బలంగా నమ్ముతోంది. నగరి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన రోజా… హ్యాట్రిక్ సాధిస్తారనేది ఆమె అభిమానుల గట్టి నమ్మకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here