విశాఖలో మెగాస్టార్ స్టూడియో..?

0
110

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాయి. రెండు దశాబ్దాలకుపైగా చిరంజీవి నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. ఆ తర్వాత సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిదేళ్లు రాజకీయాల్లో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి సినిమాల్లోకి రీ ఇచ్చారు. ‘ఖైదీ-150’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకొని బాస్ ఈజ్ బ్యాక్ అని మెగాస్టార్ నిరూపించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి విశాఖ నగరం ఫేవరెట్ ప్లేస్. ఈ ప్రాంతంలో ఆయన సినిమా షూటింగులు ఎన్నో జరిగాయి. విశాఖకు చిరంజీవి సినిమాలకు వీడదీయని సంబంధం ఉంది. ఒకనొక సమయంలో చిరంజీవి మాట్లాడుతూ తన జీవిత చరమాంకంలో ప్రశాంతమైన విశాఖ బీచ్ సొగసుల మధ్య గడిపేస్తానంటూ ప్రకటించాడు.

విశాఖలో చిరంజీవి మెగా స్టూడియో నిర్మిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఇటీవల ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీ అనంతరం ఈ ప్రచారం మరింత జోరందుకుంది. సీఎం జగన్ ప్రోద్భలంతో చిరంజీవి విశాఖలో మెగా స్టూడియో నిర్మిస్తారనే వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే పలుమార్లు జగన్ తో చిరంజీవి భేటి అయినట్లు ప్రచారం జరిగింది.

అయితే తాజాగా చిరంజీవి తన ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఔటర్ లో చిరంజీవి ఓ ఫిలింస్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ ఇప్పటిది కాదని చాలాకాలంగా ఉన్నదే అని ఇండస్ట్రీలో టాక్ విన్పిస్తోంది. అక్కినేని స్డూడియో మాదిరిగానే మెగా స్టూడియో నిర్మాణం ఉండబోతుందట. అక్కినేని స్టూడియో ఏడెకరాల్లో ఉండగా చిరంజీవి స్టూడియో పదెకరాల్లో నిర్మించబోతున్నారట.

అంతర్జాతీయ ప్రమాణాలతో స్టూడియో నిర్మించేందుకు చిరంజీవి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని స్టూడియో మాదిరిగానే ఇండోర్ షూటింగులకు అనువుగా నిర్మిస్తారట. సినిమా.. టీవీ షూటింగులు.. రియాలిటీ షోలకు అనువుగా ఈ స్టూడియో నిర్మాణం ఉంటుందని టాక్. ఈ స్టూడియో నిర్మించాలని అనుకున్న ప్రతీసారి ఏదో ఒక ఆటంకం వస్తుండంతో వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా అల్లు అరవింద్ గండిపేట్ ఏరియాలో భారీ స్టూడియో నిర్మాణాన్ని ప్రారంభించాడు. అల్లుఇందుకు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఈ విషయం అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో మెగా ఫిలిం స్టూడియో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. దీంతో చిరంజీవి వైజాగ్ లో నిర్మించాలనుకున్న ఫిలిం స్టూడియో అటెకెక్కినట్టేనా? అనే ప్రచారం జరుగుతోంది. వైజాగ్ లో స్టూడియోపై చిరంజీవికి మరేదైనా ప్లాన్ వుందా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here