విశాఖ రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు

0
110

3 రాజధానుల ఏర్పాటు విషయంలో కొంత కాలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. ఈ విషయంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున వైసీపీ నేతలు కూడా ఏం మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో విశాఖకు క్యాపిటల్ తరలింపు విషయంలో జగన్ వెనక్కు తగ్గారని, ఇక తరలింపులు ఉండవని ప్రచారాలు జరుగుతున్న సమయంలో జగన్ మళ్ళీ ఈ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. విజయవాడ కనకదుర్గ ప్లై ఓవర్ ఓపెన్ చేసిన తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తో మాట్లాడారు. విశాఖను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ గా చేస్తున్నామని, అందుకు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు ప్రత్యామ్నాయ రోడ్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

బీచ్ రోడ్డు నుంచి భోగాపురం వరకు కోస్టల్ హైవేగా టేకప్ చేయాలని జగన్ కోరారు. ఇక కేంద్రం నిర్మించే 22 గ్రీన్ ఫీల్డ్ రహదారుల్లో 6 గ్రీన్ ఫీల్డ్ రహాదారులు ఏపీ మీదుగా వెళ్లనున్నాయన్న సీఎం రూ.2611 కోట్లను రోడ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో కేంద్రం కేటాయించిందని కానీ ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల చేయలేదని గుర్తు చేశారు. మొదటి, రెండు విడతల్లో రావాల్సిన రూ. 680 కోట్లు, రూ. 820 కోట్లు విడుదల చేయాలని గడ్కరీని కోరారు.

ఓ వైపు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన, మరోవైపు కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here