శ్రేయస్ అయ్యర్ కు సన్ స్ట్రోక్…

0
10

ఓ వైపు మ్యాచ్ ఓడిన బాధ… మరోవైపు మ్యాచ్ ఫీజులో కోత… ఇది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రేయస్ అయ్యర్‌కు ఫెనాల్టీ భారీగానే పడింది. అయ్యర్‌కు రూ.12 లక్షలు ఫైన్ విధించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మినిమం ఓవర్ రేట్‌ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యార్‌కు ఫైన్ పడింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది తొలి అఫెన్స్ కావడంతో.. రూ.12 లక్షలు జరిమానాతో సరిపెట్టారు. రెండో సారి ఇదే తప్పిదానికి పాల్పడితే జరిమానా రెట్టింపు కానుంది. ఆ తర్వాత మూడోసారీ స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే జరిమానాతో పాటు కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం కూడా విధిస్తారు.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేట్ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి సైతం రూ.12 లక్షలు జరిమానా విధించారు. స్లాగ్ ఓవర్లలో బౌలర్లతో అతిగా సంప్రదింపులు జరపడంతో కోహ్లి.. నిర్ణీత వ్యవధిలోగా బౌలింగ్ కోటా పూర్తి చేయించలేకపోయాడు.

హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమైంది. ఆరంభంలో రన్స్ రాకుండా కట్టడి చేసినప్పటికీ… వికెట్లు మాత్రం తీయలేకపోయింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. టార్గెట్ ఛేజింగ్ లో హైదరాబాద్ బౌలర్ల ధాటికి 7 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కేవలం 147 రన్స్ మాత్రమే చేయగలగింది. 15 పరుగుల తేడాతో గెలిచిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆరో ప్లేస్ లో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here