సర్వభూపాల వాహ‌నం – య‌శోప్రాప్తి

0
28

తిరుమ‌ల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. సర్వ భూపాల వాహ‌నంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు.

శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమ‌వారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. 

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

 బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

 ఈ వేడుకలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here