సినిమా షూటింగ్ లకు అనుమతులు

0
16

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా షూటింగ్ లకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ఫిల్మ్‌, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకొనే అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందన్నారు. చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న జారీచేసిన మార్గదర్శకాలతో పాటు స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సినిమాల చిత్రీకరణ సమయంలో కేంద్ర మార్గదర్శకాలతో పాటు స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాల్సి ఉంటుంది.

మార్గదర్శకాల ప్రకారం టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు ధరించాలి. అయితే షూటింగ్ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఇచ్చారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సినిమా చిత్రీకరణ పరికరాలు, యూనిట్లు, సెట్లు సహా అన్ని తరచుగా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. షూటింగ్‌లో పాల్గొనే టెక్నీషియన్లు, నటీ నటులు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్లను వినియోగించాలి. సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితులు మినహా మిగిలిన సమయాల్లో తప్పనిసరిగా ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here