స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత ‌దుర్గాదేవి

0
65

శ‌ర‌న్న‌వ‌రాత్రుల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా తొలి రోజు నిజ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ భ‌‌క్తుల‌కు స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత శ్రీ దుర్గాదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అష్ట భుజాల‌తో సింహాస‌నం మీద త్రిశూల‌ధారియై.. క‌న‌క‌పు ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిసిపోయే ఆ త‌ల్లిని ద‌ర్శించుకోవ‌డం నిజంగా భ‌క్తుల‌కు క‌నుల పండగే. ఈ అలంకారంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ద‌రిద్రాలూ తొల‌గిపోతాయంటారు. స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత క‌న‌క‌దుర్గాదేవి అలంకారంలో ద‌ర్శ‌నం ఇచ్చే రోజున అమ్మ‌వారికి ప్ర‌సాదంగా చ‌క్ర‌పొంగ‌లి, క‌ట్టెపొంగ‌లిని నివేదిస్తారు.

దసరా నవరాత్రులకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దేవీ శరన్నవరాత్రులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దసరా సందడి ఆరంభం కానుంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో రోజుకు కేవలం 10 వేల మందికి మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందస్తుగా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారిని మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here