హైదరాబాద్ వాసులకు.. మోటర్ బోట్ కావాలా..?

0
59

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం పూర్తిగా జలమయమైంది. నాలాలు మూసుకు పోవడం వరద నీరు హైదరాబాద్ నగరాన్ని ముంచేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక 1908 తర్వాత ఆ స్థాయిలో వర్షం కురిసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

భారీ వర్షాలతో నగర వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు జలమయమయ్యాయి. ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం సోమవారం మళ్లీ మొదలైంది. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఇంటి పరిస్థితి ఇలా ఉందంటూ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోషల్‌మీడియాలో ఫొటోలు షేర్‌ చేశారు. ఆయన ఇంటి ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. కాలనీ మొత్తం జలమయమైనట్లు కనిపిస్తోంది. ‘మోటర్‌ బోట్‌ కొనాలనుకుంటున్నా.. ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి’ అని మరో ట్వీట్‌ చేశారు. దీనికి ఆయన ఫాలోవర్స్‌ ఫన్నీ కామెంట్లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here